ఈఎస్‌ఐలో 150 కోట్ల కుంభకోణం జరిగిందని ఏసీబీ అధికారి రవికుమార్ వెల్లడించారు. మెడిసిన్స్, ల్యాబ్ కిట్లు, సర్జికల్ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్నారు. 50 నుంచి 129 శాతం అధిక ధరకు కొనుగోలు చేశారని చెప్పారు. ఇ-టెండర్లు కాకుండా నామినేషన్ పద్ధతిలో లోపాయికారిగా కొనుగోళ్లు జరిగాయన్నారు. డీఐఎమ్‌ఎస్ స్టాఫ్, వారి కుటుంబ సభ్యుల పేరిట బినామీ మందుల కంపెనీ ఏర్పాటు చేశారన్నారు. అక్రమంగా మందుల కొనుగోళ్ల ఒప్పందాలు, బిల్లుల చెల్లింపులు జరిగాయన్నారు. నకిలీ, ఫోర్జరీ లెటర్ హెడ్స్‌తో కొటేషన్లు వేసి దొంగ బిల్లులు సృష్టించారన్నారు. ఈ కేసులో అచ్చెన్నాయుడు, మాజీ డైరెక్టర్ సీకే రమేష్ కుమార్, డా.జి.విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు.