ఈనెల 16న ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ మేరకు శాసనసభ, శాసనమండలి సచివాలయ కార్యదర్శి గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ.. రెండు సభల సభ్యులు ఒకే ప్రాంగణంలో సమావేశం కావడానికి కుదరదు.. అందువల్ల భౌతిక దూరం పాటిస్తూ సమావేశాలు జరిగేలా ఎమ్మెల్సీలు మండలిలోనూ, ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనూ సమావేశమయ్యేలా ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నారు.