శ్రీకాకుళంలో అరెస్టు చేసిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు.. విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నారు. స్థానిక ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో అచ్చెన్నాయుడుకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం... ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. కోర్టు దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఇప్పటికే విజయవాడలో టీడీపీ ముఖ్య నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.