తమిళనాడులో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్తగా 1,857 కేసులు

Update: 2020-06-11 20:48 GMT

తమిళనాడులో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గడిచిన 24గంటల్లో 1875 కేసులు బయటపడ్డాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అటు, మరణాల సంఖ్య కూడా ఎక్కవగా నమోదవ్వటంతో అధికారలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరోజులో 23 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 38,716కు చేరింది. ఇప్పటివరకూ 20,705 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 17,659 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అటు, 349మంది ప్రాణాలు కోల్పోయారు.

Similar News