భారత్ కోరితే.. ఆ దేశ ప్రజలకు నగదు సాయం చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ట్వీట్లకు భారత విదేశాంగ శాఖ ఘాటుగా బదులిచ్చింది. కరోనా సంక్షోభ కాలంలో పాక్ పౌరులకు తమ ప్రభుత్వం తొమ్మిది వారాల్లో 120 బిలియన్లను పారదర్శకంగా బదిలీ చేశారమని.. దీని వనల 10 లక్షల కుటుంబాలు లబ్ధిపొందాయని ఇమ్రాన్ ఖాన్ తెపారు. భారత పౌరులకు కూడా నగదు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన భారత్ విదేశాంగశాఖ లాక్‌డౌన్‌లో భారత్ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పాకిస్థాన్ వార్షిక జీడీపీతో సమానమని గుర్తు చేసింది. సొంత పౌరులకు ఆర్ధిక సాయం చేయకుండా.. బయటి దేశాల్లో ఉన్న బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయడం పాకిస్తాన్ కు అలవాటని చురకుల అంటించింది. ఇమ్రాన్ ఖాన్ కొత్త సలహాదారులను నియమించుకుంటే బాగుంటుందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ అన్నారు.