కరోనా దేశవ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తుంది. గత వారం రోజుల నుంచి పదివేలకు దగ్గర్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో సామాజిక వ్యాప్తి జరగలేదని.. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ అన్నారు. మన దేశంలో కరోనా మరణాల రేటు 2.8 ఉందని.. ఇది ప్రపంచ మరణాల రేటుతో పోలిస్తే.. చాలా తక్కవని అన్నారు. ఆస్పత్రుల్లో పడకల కొరత కూడా లేదని అన్నారు. లాక్‌డౌన్ తో కరోనాను చాలా వరకూ అడ్డుకున్నామని తెలిపారు. అయితే, కరోనా అనుమానిత కేసులు ఎక్కువగా ఉండొచ్చని.. అందుకే కరోనా టెస్టులు ఎక్కువగా చేయాలని నిర్ణయించామని అన్నారు. కరోనా రికవరీ రేటు కూడా 49.1 శాతంకు చేరిందని ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు.