తుగ్లక్ పాలనలో అరాచకాలు, అన్యాయాలను బయటపెట్టినందుకే అచ్చెన్న అరెస్ట్ : నారా లోకేశ్
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేశారు.' శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. కక్ష సాధింపులో భాగంగానే సీఎం జగన్ బీసీ నేత అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఏడాది తుగ్లక్ పాలనలో జరుగుతున్న అరాచకాలను, అన్యాయాలను బయటపెట్టినందుకే అచ్చెన్నాయుడు పై జగన్ పగ పట్టారని వ్యాఖ్యానించారు.
బీసీ లకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు ఆయన పై వ్యక్తిగత దూషణలకు దిగి జగన్ రాక్షస ఆనందం పొందారని దుయ్యబట్టారు. లక్ష కోట్లు కొట్టేసి 16 నెలలు ఊచలు లెక్కపెట్టిన జగన్ అందర్నీ జైలులో పెట్టాలనుకోవడం సహజమే అని అన్నారు. రాజారెడ్డి రెడ్డి రాజ్యాంగం అమలులో ఉంది ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా అరెస్ట్ చేస్తానని జగన్ గారు అనుకుంటున్నారని.. బడుగు,బలహీన వర్గాలకి రక్షణగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉందనే విషయం జగన్ గుర్తెరిగితే మంచిదని హితవు పలికారు.