కరోనా గురించి యావత్ ప్రపంచం గగ్గోలు పెడుతున్నా.. కొందరు రాజకీయ నాయకులు, అధికారులకు మాత్రం అదేమీ పట్టడం లేదు. నెల్లూరు జిల్లాలో నాయకులు, అధికారులు చేసిన పనికి దాదాపు 500 మంది ఒకే చోట గుమిగూడారు. ముఖానికి మాస్కులు కూడా లేకుండా ఒకరిని ఒకరు తోసుకున్నంత పనిచేశారు. కోట గ్రామంలో సొంత ఇంటి కలకు లాటరీ ప్రక్రియ కోసం గ్రామస్తులందరినీ ఒకేసారి సచివాలయానికి రమ్మని పిలిచారు. దీంతో దాదాపు 500 మంది పొలోమంటూ వచ్చేశారు. వారిలో చాలా మందికి మాస్కులు లేవు. అధికారులు, నాయకుల వైఖరిపై స్థానికులు మండిపడుతున్నారు.