మళ్లీ లాక్డౌన్.. కోర్టు వ్యాఖ్యలు..

Update: 2020-06-11 20:25 GMT

కరోనా కంటే భయపెడుతుంది లాక్డౌన్. ఇంట్లో కూర్చుంటే కడుపు ఎలా నిండుతుంది. పని చేసుకుంటే పదో పరకో వస్తాయని బడుగు జీవులు ఆందోళన చెందుతున్నారు. కానీ లాక్డౌన్ తప్పదు.. తమిళనాడులో కేసులు ఎక్కువగా వస్తున్నాయంటోంది మద్రాస్ హైకోర్ట్. వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో మరోసారి పూర్తి లాక్డౌన్ ఎందుకు అమలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాప్తిని నిరోధించాలంటే లాక్డౌన్ తప్పని సరిని ప్రభుత్వ తరుపు న్యాయవాదికి తెలిపింది. అయితే దీనిపై ప్రభుత్వం వివరణ తెలుసుకునేందుకు గడువు కావాలని కోరడంతో విచారణ వాయిదా వేసింది.

Similar News