పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్‌గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అచ్చెన్నాయుడును ACB అధికారులు హైవే మీదుగా విజయవాడ తీసుకొస్తున్నందున.. అక్కడ నిరసన తెలిపేందుకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని సిద్ధమయ్యారు. అనుచరులతో కలిసి టోల్‌గేట్ వద్దకు చేరుకున్నారు. దీంతో.. వారిని అడ్డుకున్న పోలీసులు చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, చింతమనేనికి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని టీడీపీ కార్యకర్తలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.