ప్రముఖ సీనియర్ పాత్రికేయులు డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు (93) మరణించారు. ఆయన గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఛాతీ నొప్పి రావడంతో నారాయణరావును కుటుంబసభ్యులు గురువారం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
కృష్ణా జిల్లా వీరులపాడులో 1927 ఆగస్టు 13న వాసిరెడ్డి లక్ష్మయ్య, నాగరాజమ్మ దంపతులకు జన్మించారు. రైతు ఉద్యమ నేత, అన్నదాత మాసపత్రిక మాజీ సంపాదకుడు డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు పనిచేశారు. ఆయన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక డాక్టర్ నాయుడమ్మ అవార్డు, డా.సీకే రావు అవార్డులు అందుకున్నారు. నారాయణరావు మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం తెలిపారు.