అసెంబ్లీ సమావేశాలకు ముందు అచ్చెన్న అరెస్ట్ సందేహాలకు తావిస్తోంది : జనసేన

Update: 2020-06-13 04:04 GMT

తెలుగుదేశం శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు అరెస్టుపై జనసేన పార్టీ స్పందించింది. ఈ మేరకు ట్విట్టర్ లో లేఖ విడుదల చేసింది. అందులో ఇలా పేర్కొంది.. అచ్చెన్నాయుడును అరెస్టు చేసింది అవినీతికి పాల్పడినందుకా? లేదా రాజకీయ కక్ష సాధింపు కోసమా అనే విషయంలో వైసిపి ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని పేర్కొంది.

అవినీతి ఏ రూపంలో ఉన్నా దానికి బాధ్యులు ఎంతటి వారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేస్తూనే..

అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు అచ్చెన్నాయుడుని అరెస్టు చేయడం సందేహాలకు

తావిస్తోందని అభిప్రాయపడింది. అదే విధంగా ఒక శాసనసభ్యుడిని అరెస్ట్‌ చేసే ముందు రాజ్యాంగ నియమ నిబంధనలను

పాటించవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందని.. అచ్చెన్నాయుడు అరెస్టులో అవి లోపించినట్లు

కనిపిస్తున్నాయని పేర్కొంది.

Similar News