అచ్చెన్నాయుడి రెస్టును నిరసిస్తూ... కర్నూల్ నగరంలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెటి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్వి నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. జగన్ అధికారంలోకి వచ్చాక కేవలం టీడీపీ నేతలను టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీసీ నేత అయిన అచ్చెన్నాయుడు అసెంబ్లీ సమావేశాల్లో బలంగా తన గళాన్ని విప్పుతారని భయపడి అక్రమ అరెస్టు చేశారని ఆరోపించారు. అచ్చెన్నాయుడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.