ఆమెపై కక్ష.. నకిలీ వాట్సాప్ క్రియేట్ చేసి అసభ్యంగా..

Update: 2020-06-12 19:46 GMT

మాట్లాడడం మానేసిందని ఆమెపై కక్షపెంచుకుని వాట్సాప్ లో వేధించడం మొదలు పెట్టాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన నదిండ్ల రోహిత్ ఆర్యన్ 2017 నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో గ్రాఫిక్ డిజైనర్ గా పని చేస్తున్నాడు. అదే సంస్థలో పని చేస్తున్న ఓ యువతితో అతడికి పరిచయమైంది. ఆరునెలలు బాగానే ఉన్నారు. ఆ తరువాత ఇద్దరికీ గొడవైంది. దాంతో ఆ యువతి రోహిత్ తో మాట్లాడడం మానేసింది. ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిప్ట్ చేయట్లేదు.

దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న రోహిత్ ఎలాగైనా ఆమె పరువుతీయాలని స్కెచ్ గీశాడు. చదువుకున్న తెలివితేటల్ని ఓ చెత్త పని చేయడానికి వినియోగించాడు. ఆ యువతి ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీతో నకిలీ వాట్సాప్ క్రియేట్ చేశాడు. అందులో ఆ యువతి ఫోటో ఉంచి అసభ్యకర మెసేజ్ లు, అశ్లీల పదాలు వాడుతూ స్నేహితులకి పోస్టులు పెడుతున్నాడు. విషయం తెలుసుకున్న యువతి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైం ఇన్ స్పెక్టర్ రాము టెక్నికల్ ఆధారాలు సేకరించి రోహిత్ ఆర్యన్ ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.

Similar News