అచ్చెన్నాయుడి అరెస్టును.. బడుగు బలహీనవర్గాలపై జరిగిన దాడిగా అభివర్ణించారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. అక్రమ అరెస్టును ఖండిస్తూ... పాలకొల్లులో ఆందోళనకు దిగారు టీడీపీ నేతలు. అరెస్టును నిరసిస్తూ...జ్యోతీరావు పూలేకు మెమోరాండం ఇచ్చారు. జగన్ ఏడాదిపాలనపై ప్రజల్లో అభద్రతా భావం కలగడంతో జనం దృష్టిని మరల్చేందుకే అచ్చెన్నాయుడి అక్రమ అరెస్టు అన్నారు. విచారణ, నోటీస్ లేకుండా ఓ ప్రజాప్రతినిధిని అరెస్టు చేయడం సిగ్గుచేటు అన్నారు. అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తే భయపడబోమని.. ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌రావు తెలిపారు.