లాక్ డౌన్ కాలంలో దాదాపు 82 రోజులపాటు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచని ఆయిల్ కంపెనీలు.. ప్రస్తుతం గత వారం రోజులుగా రేట్లను పెంచుతూనే ఉన్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా 7వ రోజు కూడా పెరిగాయి. పెట్రోల్ ధరను లీటరుకు 58 పైసలు, డీజిల్ ధరను 59 పైసలు చొప్పున పెంచాయి. తాజా పెంపుతో ఏడు రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 3.90, డీజిల్ ధర లీటరుకు రూ. 4.01 పెరిగింది. ఇక పెరిగిన ధరలతో ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ లో పెట్రోల్ రూ.78.03, డీజిల్ రూ. 71.73 గా ఉంది. విజయవాడలో పెట్రోల్ రూ.78.53, డీజిల్ రూ.72.28 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ. 78.99, డీజిల్ రూ. 71.64 గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రూ.77.59, డీజిల్ రూ. 69.78 గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ. 82.10, డీజిల్ రూ.72.03 గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ రూ. 75.16, డీజిల్ రూ. 73.39 గా ఉంది.