టీడీపీని నిర్వీర్యం చేయాలన్న కక్షతో జగన్ ఉన్నారని ఆరోపించారు ఆ పార్టీ సీనియర్ నేత బోండా ఉమ. కోస్తా ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం తనను చంపాలని చూశారన్నారు. నిన్న ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారన్నారు. రాయలసీమలో జేసీ ప్రభాకర్‌రెడ్డిని అరెస్ట్ చేసి పగ సాధిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఒక ఉన్మాదిగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు బోండా ఉమ.