జియో కస్టమర్లకు మరో బంపరాఫర్..

Update: 2020-06-12 19:01 GMT

రిలయన్స్ జియో తాజాగా జియోఫైబర్ వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ అందిస్తోంది. రూ.999 అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు జియో ప్రకటించింది. జియో ఫైబర్ గోల్డ్, ఆపైన ప్లాన్ లో ఉన్న జియో ఫైబర్ వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (హిందీ, ఇంగ్లీష్, మరాఠి, తమిళ్, మలయాళం, గుజరాతీ, తెలుగు, కన్నడ, పంజాబీ, బెంగాలీ)తో పాటు యాడ్ ఫ్రీ మ్యూజిక్ ప్రైమ్ గేమింగ్, ప్రైమ్ రీడింగ్ అందుబాటులో ఉంది. గోల్డ్ కస్టమర్లు ఈ ఆఫర్లకు అర్హులు. అలాగే ఎవరైనా ఈ ఆఫర్ పొందాలనుకుంటే జియో ఫైబర్ గోల్డ్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ కు రీచార్జ్ చేసుకోవచ్చు. లేదా పాత ప్లాన్ ను అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.

జియోఫైబర్ గోల్డ్ ప్లాన్ ఆఫర్లు

250 ఎంబీపీఎస్ వేగంతో డేటా. నెలకు 1,750 జీబీ డేటా వరకు అపరిమిత ఇంటర్నెట్. అపరిమిత వాయిస్ కాలింగ్, అపరిమిత వీడియో కాలింగ్ అండ్ కాన్ఫరెన్సింగ్ (టీవీ వీడియో కాలింగ్ కూడా ఉంది) ఇతర జియో ఆప్ లకు అన్ లిమిటెడ్ యాక్సెస్ ఉంది.

Similar News