వైసీపీ అవినీతికి పుట్టినిల్లు లాంటిదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. అలాంటి పార్టీ అవినీతి గురించి మాట్లాడే హక్కులేదన్నారు. రాష్ట్రంలో దళితులు, బీసీలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. టీడీపీ బీసీల పార్టీ కాబట్టే.. పార్టీలోని బీసీ నేతలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదన్నారు బుద్దా వెంకన్న.