నేపాల్ దుస్సాహసాన్ని సహించేది లేదు: భారత్

Update: 2020-06-14 15:20 GMT

సరిహద్దు భూబాగాల విషయంలో నేపాల్ ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరును భారత ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. భారత ప్రభుత్వం అభ్యంతరం చేస్తున్నప్పటికీ దేశ మ్యాప్‌ను మారుస్తూ రూపొందించిన బిల్లును నేపాల్ పార్లమెంట్ దిగువ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనిపై స్పందించిన భారత్ ప్రభుత్వం.. చర్చలు ద్వారా పరిస్కరించుకోవలసిన సరిహద్దు వివాదాలను.. నేపాల్ ప్రభుత్వం మరింత తీవ్రం చేస్తుందని అన్నారు. సుగౌళీ ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించి నేపాల్ దుసాహసానికి పాల్పడిందని మండిపడింది. భారత్ ఆధీనంలో ఉన్న భూబాగాలను తమవిగా చూపిస్తూ విడుదల చేసిన మ్యాప్ కు అనుగుణంగా రూపొందిచిన బిల్లుకు మద్దతుగా అన్ని నేపాల్ పార్టీలు ఓటు వేసి ఆమోదం తెలిపాయి.

Similar News