3rd Phase Polling : మూడో దశ పోలింగ్.. 244 మందిపై క్రిమినల్ కేసులు

Update: 2024-04-30 05:21 GMT

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్ జరగనున్న 95 స్థానాల్లో 1352 మంది బరిలో ఉన్నారు. ఇందులో 123 మంది మహిళలు పోటీలో నిలిచారు. మొత్తంగా 244 మంది(18శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక వెల్లడించింది.

172 మందిపై తీవ్ర క్రిమినల్ కేసులు, ఐదుగురిపై హత్య, 38 మందిపై అత్యాచారం కేసులున్నాయి. కాగా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మే 7న పోలింగ్ జరగనుంది. మే 7న జరగనున్న లోక్ సభ మూడో ఫేజ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది (29%) కోటీశ్వరులు ఉన్నారు.

ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తి రూ.5.66 కోట్లుగా ఉంది. ఏడీఆర్, ది నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించి ఈ రిపోర్టును తయారు చేశాయి. మూడో ఫేజ్ లో పోటీ చేస్తున్న మొత్తం 1,352 మంది అభ్యర్థుల్లో కేవలం 123 మంది (9%) మాత్రమే మహిళలు ఉన్నారని రిపోర్టులో తేలింది. 244 మందిపై (18%) క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడైంది.

Tags:    

Similar News