భారత్ లో కొత్తగా 11,502 కరోనా కేసులు..

Update: 2020-06-15 13:49 GMT

భారత్ లో మరోసారి పాజిటివ్ కేసులు 11వేలు దాటాయి. గత 24 గంటల్లో అన్ని రాష్ట్రాల్లో కలిపి 11,502 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో భారతదేశం 115,519 మందికి కరోనా పరీక్షలు చేశారు. కొత్త అంటువ్యాధులతో కలిపి మొత్తం కరోనావైరస్ కేసులు ఇప్పుడు 332,424 గా ఉన్నాయి. ఇందులో 169,798 నయమైన కేసులు ఉన్నాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తన తాజా డేటాలో తెలిపింది. ప్రస్తుతం,153,106 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. అలాగే సంక్రమణ కారణంగా భారతదేశంలో మరణించిన వారి సంఖ్య 9,520 కి చేరుకుంది.

Similar News