అంతర్రాష్ట బస్సు సర్వీసులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెల 17 నుంచి ఆంధ్రప్రదేశ్-కర్ణాటకకు బస్సు సర్వీసులను పునరుద్ధరించింది. రాష్ట్రంలోని బెంగళూరు సహా పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడపాలని ఏపీఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం ముందుగా పరిమిత సంఖ్యలో మాత్రమే బస్సులను నడపనుంది.
తొలుత 168 బస్సు సర్వీసులతో ప్రారంభించి అనంతరం నాలుగు దశల్లో గతంలో ఎన్ని బస్సులైతే తిరిగేవో అన్ని బస్సులను తిప్పనుంది. ఇందులో భాగంగా తొలివిడత బస్సు సర్వీసుల పునరుద్ధరణకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఇవాల్టినుంచి ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లను ప్రారంభం అయింది. అయితే ప్రయాణించే సమయాల్లో ప్రయాణికులు తప్పనిసరిగా బస్సుల్లో భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్ ను వాడాలి.