తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

Update: 2020-06-14 20:09 GMT

తెలంగాణలో నమోదవుతున్న కేసులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులకు కరోనా సోకడంతో ప్రభుత్వ యంత్రాంగం ఆందోళన చెందుతుంది. తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌కు కరోనా సోకినట్టు వైద్యులు తెలిపారు. గత మూడు రోజుల నుంచి జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆయన కరోనా పరీక్షలు చేపించుకోగా.. ఈ మహమ్మారి సోకినట్టు తేలింది. ఇప్పటికే జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగరి రెడ్డికి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.

Similar News