యోగాను తప్పుపడుతున్న జగన్..

Update: 2025-12-20 07:38 GMT

వైసీపీ అధినేత జగన్ అప్పుడప్పుడు ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం పర్థం లేకుండా అనేస్తున్నాడు. తాను పట్టుకున్న కుందేలుకు మూడు కాళ్ళే అన్నట్టు.. కూటమి ప్రభుత్వం ఏం చేసినా సరే తప్పే అన్నట్టు మాట్లాడుతున్నాడు. అందులో భాగంగా మెడికల్ కాలేజీలలో పిపిపి విధానాన్ని ఎత్తుకున్న జగన్.. దాన్ని వెంటనే రద్దు చేయాలని లేదంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానంలో పెట్టుబడులు పెట్టిన వారందరినీ జైల్లో వేస్తామంటూ బెదిరిస్తున్నాడు. ఇక్కడ ఇంకో మాట చెబుతున్నాడు. తాను ఉన్నప్పుడే మెడికల్ కాలేజీలను చాలా వరకు కట్టాను అంటున్నాడు.

మహా అయితే ఇంకో ఐదు వేల కోట్లు అయితే కావచ్చు ఆ మాత్రం కూడా ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి మనసు రావట్లేదు. కానీ ఋషికొండ మీద యోగా కార్యక్రమం చేపట్టడానికి 300 కోట్లు ఖర్చు పెట్టాడని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు జగన్. వాస్తవానికి చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమం చేపట్టడానికి కేవలం 110 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. ఆ విషయం తెలియకుండా జగన్ ఇష్టం వచ్చినట్టు తప్పుడు నెంబర్లు చెబుతున్నాడు. కానీ 110 కోట్లతో ఎలాంటి అక్రమాలు చేయలేదు కదా. జనాల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. కానీ జగన్ మాత్రం యోగాను అవమానపరిచాడు. మరి జగన్ కూడా పొద్దున లేస్తే జిమ్ కు వెళ్తున్నాడు కదా.

అంటే జగన్ మాత్రమే ఆరోగ్యంగా ఉండాలి కానీ ఇంకెవరూ ఆరోగ్యంగా ఉండొద్దా. ఏపీ ప్రజలకు ఆరోగ్యం మీద అవగాహన కూడా కల్పించొద్దా. ఆరోగ్యంగా ఉంటే వారికి హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు కదా. కానీ జగన్ దృష్టిలో చంద్రబాబు నాయుడు ఏ మంచి పని చేసినా అది తప్పే అవుతుందేమో. వాస్తవానికి జగన్ ఒక్క మెడికల్ కాలేజీని కూడా పూర్తి చేయలేదు. అన్నీ పిల్లర్ల దగ్గర ఆగిపోయాయి. ఇప్పుడు వాటన్నింటినీ కంప్లీట్ చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద వేల కోట్ల భారం పడుతుంది. అసలే అప్పుల్లో కూరుకుపోయి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నా ఏపీకి పిపిపి విధానం ఒక మంచి ఆప్షన్. కానీ జగన్ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం ఎందుకో ఆయనకే తెలియాలి.

Tags:    

Similar News