జగన్‌లా.. ప్రభాకర్ రెడ్డి దేశాన్ని దోచుకోలేదు : నారా లోకేశ్

Update: 2020-06-15 14:22 GMT

దొంగకేసులు పెడితే భయపడేది లేదు.. మా నాయకులపై దాడి చేస్తే ఊరుకునేది లేదంటూ వైసీపీ సర్కార్‌ను తీవ్రంగా హెచ్చరించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తాడిపత్రి వెళ్లిన లోకేష్.. జేసీ కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్న లోకేష్.. ఫిబ్రవరి నుంచి 22 కేసులు పెడుతూ వచ్చారన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆర్థిక నేరస్తుడు కాదని.. ఆయన జగన్‌లా దేశాన్ని దోచుకోలేదని అన్నారు.

Similar News