విశాఖలో రెచ్చిపోతున్న వ్యభిచార ముఠాలు

Update: 2020-06-15 11:12 GMT

విశాఖలో వ్యభిచార ముఠాలు రెచ్చిపోతున్నాయి. అమాయక యువతుల్ని టార్గెట్ చేసి రొంపిలోకి దించి జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇటీవల ఇలాంటి ఓ ముఠా అరాచకానికి దివ్య ఎలా బలైపోయిందో చూసాం. తాజాగా ఓ యువతి ఈ కూపం నుంచి బయటపడి పోలీసుల్ని ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో ముగ్గురు మహిళా నిర్వాహకులను, మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంతానికి చెందిన యువతి కొన్నాళ్ల కిందట ఇంటి వెళ్లిపోయింది. ఒంటరిగా తిరుపతి చేరింది. అక్కడ జాగ్రత్తగా ట్రాప్ చేసి, ఆమెకు తమ ఫోన్ నంబర్ ఇచ్చి ఏమైనా సాయం కావాలంటే కలవాలని సూచించారు. మొత్తానికి నమ్మించి విశాఖపట్నం తీసుకొచ్చారు. అక్కడ వ్యభిచారంలోకి దించారు. నర్సీపట్నానికి చెదిన వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీవనం చేసి మోసం చేశాడని.. ఇటు ఈ ముఠా తనను వ్యభిచారంలోకి దించి టార్చర్ పెట్టిందని బాధిత యువతి చెప్తోంది.

Similar News