ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి. పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ అంటూ చెప్పిన మాటల వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు. అటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో YCP దౌర్జన్యాలపైనా మాట్లాడారు. బెదిరించి ఏకగ్రీవాలు చేసుకుంటున్న విషయంపై, BJP ఫిర్యాదులతో చర్యలు మొదలవుతాయనే కారణంగానే SECని మార్చారన్నారు.