రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఐతే.. టీడీపీ నేతల వరుస అరెస్టులకు నిరసనగా.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని చంద్రబాబుకు కొందరు ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. ఈ అంశంలో టీడీఎల్పీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే.. ఎలాంటి అంశాలు లేవనెత్తాలో చర్చించనున్నారు.