కరోనా నిబంధనలు అతిక్రమించిన వైసీపీ ఎమ్మెల్యే

Update: 2020-06-14 19:14 GMT

శ్రీకాకుళం జిల్లాలో అధికారపార్టీ MLAలు, నేతలు కోవిడ్‌ నిబంధనలు పట్టించుకోవడం లేదు. తాజాగా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలంలో నువ్వలరేవు-మంచినీళ్లపేట మధ్య 12 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన జెట్టీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వందలాది మంది వైసీపీ కార్యక్తలు, స్థానిక మత్స్యకారులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. చాలా మంది కనీసం మాస్కులు కూడా ధరించకుండానే తిరగడం కలవరానికి గురి చేసింది.

భౌతిక దూరం పాటించకుండా వందల మంది ఒక చోట గుమికూడడం ఆందోళనకు కారణమైంది. మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడును కలిసి మాట్లాడేందుకు కోవిడ్ నిబంధనల పేరుతో అనుమతి నిరాకరించిన పోలీసులు.. తీరా అధికారపార్టీ నేతల వద్దకు వచ్చేసరికి రూల్స్‌ ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Similar News