ఏపీలో మరో 193 కరోనా కేసులు నమోదు

Update: 2020-06-16 15:35 GMT

ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు మరోసారి పెరిగాయి. గత 24 గంటల్లో 15,911 శాంపిల్స్ ను పరీక్షించగా రాష్ట్రవ్యాప్తంగా 193 మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,280కు చేరింది. అలాగే సోమావారం 81 మంది కోలుకోవడంతో ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ చేశారు. ఇప్పటివరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2851 కు చేరింది. కొత్తగా మరో ఇద్దరు మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 88కు చేరింది. ప్రస్తుతం 2341 మంది రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

Similar News