రాష్ట్రంలో అరాచక, ఆటవిక పాలనకు నాంది పలికారని.. వైసీపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని అన్నారు టీడీఎల్పీ ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని అన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని.. ప్రభుత్వం అవినీతి అరచకాలకు కేంద్ర బిందువుగా మారిందని అన్నారు. ప్రతిపక్షానికి సమస్యలపై ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా రెండు రోజుల్లో సభ ముగించాలని చూడటం తగదని హితవు పలికారు.