ఢిల్లీ ఆరోగ్యశాఖా మంత్రికి అస్వస్థత..

Update: 2020-06-16 12:48 GMT

ఢిల్లీ ఆరోగ్యశాఖా మంత్రి సతేంద్ర జైన్ అస్వస్థతకు లోనయ్యారు. ఆయన అధిక జ్వరం తోపాటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయనను రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చేరిన విషయాన్నీ స్వయంగా సతేంద్ర జైన్ తన ట్విట్టర్‌ లో వెల్లడించారు. 'అధిక జ్వరం , గత రాత్రి నా ఆక్సిజన్ స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవటం వలన నేను RGSSH లో చేరాను.' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా ఆదివారం హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి సతేంద్ర జైన్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఎల్జీ అనిల్ బైజల్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా పాల్గొన్నారు.

Similar News