నేడు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు!

Update: 2020-06-16 09:13 GMT

ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉండటంతో మధ్య భారతం మీదుగా తూర్పు, పడమరగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధప్రదేశ్ లోని ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. అలాగే రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది, ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, దియు ద్వీపం అంతా విస్తరించాయి. కాగా ఈనెల 19న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది.

Similar News