మోదీ ఏడాది పాలన చరిత్రాత్మకమైందని అన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఏడాది పాలనంతా సవాళ్లతో సాగిందని.. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేసిందన్నారు. దేశం అనేక సంక్షోభ, సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే.. మోదీ దేశానికి దిశా నిర్దేశం చేశారని కొనియాడారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తమ ప్రభుత్వ విజయాలను చెప్పుకోవడానికి అవకాశం లేకపోయిందని అన్నారు.