పల్నాడులో చంద్రబాబు ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచిపోషించారన్న కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. ఇది ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి మహేష్ రెడ్డికి లేదన్నారు. పేకాట క్లబ్బులు నడుపుతున్నది మహేష్ రెడ్డేనని అన్నారు. పల్నాడులో కాసు కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాలు పెంచి పోషిస్తే.. చంద్రబాబు అభివృద్ధి చేశారని తెలిపారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా.. తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.