భారత్ లో కరోనా మరణాలు కొత్తగా 2,003 పెరగడంతో, భారతదేశంలో కరోనావైరస్ మరణాల సంఖ్య బుధవారం 11,903 కు చేరింది, అలాగే భారతదేశంలో మొత్తం కేసులు 3.5 లక్షలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం తాజా గణాంకాల ప్రకారం దేశంలో సుమారు 11,000 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,54,065 కు చేరుకున్నాయి. అయితే ఇందులో 1,86,934 రికవరీలు కూడా ఉన్నాయి. డిశ్చార్జ్ లు మరణాలు పోను.. 1,55,227 యాక్టీవ్ కేసులున్నాయి. మహారాష్ట్ర మరణాల సంఖ్య 5,537 కు చేరుకుంది.