కోవిడ్‌ రూల్స్‌ వైసీపీ సభ్యులకు పట్టవా?

Update: 2020-06-17 14:14 GMT

కోవిడ్‌ రూల్స్‌ ఏపీ సీఎం జగన్‌కు, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు పట్టవా? కేవలం సామాన్యులే ఈ రూల్స్‌ పాటించాలా? ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్‌తో పాటు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల తీరు చూస్తే ఇదే భావన కలుగుతోంది. అధికారపార్టీ నేతలెవరూ కోవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. మాస్కులు లేకుండానే సభకు హాజరవుతున్నారు.

సమావేశాలకు రెండ్రోజుల ముందే ఆరోగ్యశాఖ.... అసెంబ్లీతో పాటు పరిసరప్రాంతాల్లో శానిటైజేషన్‌ నిర్వహించింది. అలాగే జిల్లాలో కోవిడ్‌ పరీక్షలు చేసుకోని ఎమ్మెల్యేలకు సైతం.. ప్రత్యేకంగా పరీక్షలు చేసింది. కానీ పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు... మాస్క్‌లు పెట్టుకోవడం లేదు. ఇక సీఎం జగన్‌ అయితే...... ఇప్పటి వరకు జరిగిన ఏ రివ్యూ మీటింగ్‌లోనూ మాస్కులు లేకుండానే హాజరవుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు మాస్కు లేకుండానే హాజరయ్యారు.

మాస్కులు పెట్టుకోకపోతే.. పట్టణాల్లో అయితే వెయ్యి రూపాయలు, గ్రామాల్లో అయితే 5 వందల రూపాయలు జరిమానా విధిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం... ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ రూల్స్‌ పాటించకపోవడం విశేషం. అటు విపక్ష టీడీపీ సభ్యులు చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం మాస్కులతో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.

Similar News