నరసాపురం MP రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలపై అసెంబ్లీ లాబీలో హాట్‌హాట్ చర్చ జరిగింది. ఆయనలా ఫీలయ్యే వాళ్లు వైసీపీలో చాలామందే ఉన్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు అన్నారు. MP ధైర్యవంతుడు కాబట్టి ముందుకొచ్చి మాట్లాడారని అన్నారు. సామాజిక వర్గాల మధ్య వైసీపీ చిచ్చుపెడుతోంది అనే మాట వాస్తవమేనన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒంటెత్తు పోకడకు పోకుండా.. కనీసం వైసీపీ ప్రజాప్రతినిధుల మనోభావాలనైనా గౌరవించాలని మంతెన సత్యనారాయణరాజు అన్నారు. అటు, TDP ఎమ్మెల్యే రామానాయుడు కూడా రఘురామకృష్ణంరాజు చెప్పింది నిజమన్నారు. నరసాపురం టీడీపీకి కంచుకోటేనని చెప్పారు. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఎంపీ మాట్లాడారని రామానాయుడు అన్నారు.