కృష్ణాజిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఏడుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో మరణించిన వారంతా ఖమ్మం జిల్లా మధిర వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయలో ట్రాక్టర్ లో 20 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.