మళ్ళీ పాత బిల్లులు తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధం : యనమల రామకృష్ణుడు

Update: 2020-06-17 12:48 GMT

రాజధాని మార్పుపై ప్రభుత్వం మొదట్నుంచి దురుద్దేశంతో ఉందన్నారు మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు. సెలక్ట్ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉండగా మళ్లీ బిల్లులు తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని మండిపడ్డారు. రెండోసారి బిల్లులు పాస్ చేసి మండలికి పంపడం సరికాదని అన్నారు. ఎలాంటి సవరణలు లేకుండా మళ్లీ పాత బిల్లులు తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. కౌన్సిల్‌లో బిల్లును ఎలా అడ్డుకుంటామో మీరే చూస్తారని అన్నారు.

బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లాక మళ్లీ దాన్ని సభలో ఎలా ప్రవేశపెడతారని విపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లాయంటూ అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పారని అలాంటప్పుడు మళ్లీ ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు. మండలిలో బిల్లుల్ని వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

Similar News