అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్ చేసింది. తమ పార్టీ నేతల్ని అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, వివిధ అంశాలపై మాట్లాడదామంటే సభలో అందుకు అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. TDP సభ్యులు సభ నుంచి బయటకు వచ్చేశారు. ప్రభుత్వ తీరును విపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. నిన్నగవర్నర్ ప్రసంగం సమయంలోను, బడ్జెట్ సమయంలోనూ కూడా టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. రెండ్రోజులు మాత్రమే జరుగుతున్న ప్రస్తుత సెషన్‌లో ఇవాళ బడ్జెట్‌పై చంద్రబాబు సభా ఇతర సభ్యులు మాట్లాడాల్సి ఉంది. కానీ.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.