ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. రెండు రోజులపాటు సభ జరగగా.. మొత్తం 5 గంటల 58 నిమిషాలపాటు పనిచేసింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం కొత్తగా 11 బిల్లులను ప్రవేశపెట్టింది. పెండింగ్ బిల్లులతో కలిపి మొత్తం 15 బిల్లులకు ఆమోదం తెలిపారు. 2020-21 వార్షిక బడ్జెట్, ద్రవ్యవినిమయ బిల్లుకు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన NRC, NPRను రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమన్న తీర్మానాన్ని ఆమోదించారు. ఇక బడ్జెట్, గవర్నర్ ప్రసంగాలపై ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం తెలిపారు. చైనా దుశ్చర్య కారణంగా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌కు ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది.