ఆంధ్రప్రదేశ్‌లో హడలెత్తిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు.. తాజాగా..

Update: 2020-06-18 15:19 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు హడలెత్తిస్తున్నాయి. గత 24 గంటల్లో 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. దీంతో.. మొత్తం కేసులు 7 వేల 496కి చేరాయి. ఇవాళ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఏపీకి చెందిన 299 మందిలోను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 100 మందికి కరోనా సోకినట్టు నిర్థారించారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 26 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందగా మొత్తం మరణాలు 92కి చేరాయి. తాజాగా మృతి చెందిన ఇద్దరు కూడా కృష్ణా జిల్లా వారే. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు యాక్టివ్ కేసులు 2 వేల 779 ఉన్నాయి. 2 వేల 983 మంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపడుతూనే.. టెస్టింగ్, ట్రేసింగ్ విషయంలో తాము చురుగ్గానే వ్యవహరిస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. ఇవాళ ఏకంగా 425 కేసులు నమోదవడం చూస్తుంటే.. సామాజిక వ్యాప్తి పరిస్థితి వచ్చిందా అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

Similar News