భారత్‌లో కొత్తగా 13,586 కరోనా పాజిటివ్‌ కేసులు

Update: 2020-06-19 13:12 GMT

దేశంలో కరోనా రోగుల సంఖ్య 3 లక్షల 81 వేల 91 కు పెరిగింది. వీరిలో 2 లక్షలకు పైగా రోగులు కోలుకున్నారు. గత 5 రోజుల్లో 42 వేల 856 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 13,586 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన హెల్త్‌బులిటెన్‌లో పేర్కొంది. అలాగే 342 మంది మరణించారు. ప్పటివరకు 3,80,532 కరోనా కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా మరణాల సంఖ్య 12,573కు చేరింది. ఇప్పటివరకు 2,04,711 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 1,63,248 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. ఇదిలావుంటే రికార్డు స్థాయిలో దేశ రాజధాని ఢిల్లీలో 2877 మందికి కరోనా నిర్ధారణ అయింది. మరోవైపు, మహారాష్ట్రలో 24 గంటల్లో అత్యధికంగా 3752 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇ

Similar News