ఏపీ మెడ్‌టెక్ జోన్ భాగస్వామ్యంతో కొత్త ఆవిష్కరణ.. దేశంలోనే తొలి సంచార లేబొరేటరీ

Update: 2020-06-18 19:11 GMT

కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ, ఏపీ మెడ్‌టెక్ జోన్ సంయుక్తంగా ఓ కొత్త ఆవిస్కరణ చేశాయి. దీని ఫలితంగా కోవిడ్ పరీక్షల కోసం ఇండియాలోనే తొలి సంచార లేబొరేటరీని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ప్రారంభించారు. మారుమూల ప్రాంతాలలో కూడా వైద్యపరీక్షలు నిర్వహించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించామని కేంద్రమంత్రి తెలిపారు. మన దేశంలో క్రిటికల్ హెల్త్ కేర్ టెక్నాలజీ కొరత తీర్చే ప్రయత్నంలో భాగంగా.. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంగా ఇలాంటి ఆవిస్కరణలు చేస్తున్నామని అన్నారు. దీని ద్వారా కరోనా పరీక్షలు మాత్రమే కాదు.. మరిన్ని వ్యాదులకు కూడా పరీక్షలు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రతీరోజు 25ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేయడంతో పాటు 300 ఈఎల్ఐఎస్ఏ పరీక్షలు, సీజీహెచ్ఎస్ రేట్లకు టీబీ, హెచ్‌ఐవీ పరీక్షలు కూడా నిర్వహించే సామర్థ్యం ఈ మొబైల్ లేబొరేటరీకి ఉంటుందని అన్నారు. కరోనాపై పోరాటంలో భాగంగా ఫిబ్రవరిలో ఒక లేబొరేటరీ ప్రారంభంచగా.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా 953 ఉన్నాయని మంత్రి హర్షవర్థన్ అన్నారు.

Similar News