కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పూరీ జగన్నాథ్ రథయాత్రకు సంబంధించిన కార్యకలాపాలు అన్నీ నిలిపి వేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 23న ప్రారంభం కానున్న ఒడిశా పూరీలో రథయాత్రను వాయిదా వేయాలని కోరుతున్న పిటిషన్ ను కోర్టు విచారించింది. మేము రథయాత్రకు అనుమతిస్తే పూరీ జగన్నాధుడు మమ్మల్ని క్షమించడు అని భారత ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మహమ్మారి సమావేశంలో ఇటువంటి సమావేశాలు జరగవు అని సుప్రీంకోర్టు తెలిపింది. రద్దీ వాతావారణంలో వైరస్ విస్తరించే అవకాశాలున్నాయని తెలిపింది. ప్రజారోగ్యం, పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రధయాత్రకు అనుమతించలేమని కోర్టు తెలిపింది. ప్రతి ఏటా దాదాపు 10 లక్షల మంది రధయాత్రకు హాజరవుతారు. ఈ కార్యక్రమం 10-12 రోజులు కొనసాగుతుంది.