ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..: షమీ

Update: 2020-06-19 15:32 GMT

మనిషిని కృంగదీసేది మానసిక రోగం. ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆత్మహత్యకు పురిగొల్పుతాయి. అలాంటి అత్యయిక స్థితి నుంచి కోలుకుని మనిషిగా మారాలంటే మన అనుకునే వాళ్లు మన చెంత ఉండాలి. మానసిక ధైర్యాన్ని అందించగలగాలి. మంచీ చెడూ వారితో షేర్ చేసుకుంటే ఆత్మహత్య ఆలోచనలకు అడ్డుకట్ట వేసిన వారవుతాం.. ఆ స్థితి నుంచి తానూ బయటపడ్డానని ఒకప్పుడూ తనకీ ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని భారత పేసర్ మొహమ్మద్ షమీ చెప్పాడు.

భార్యతో విడిపోయినప్పుడు చాలా క్లిషమైన పరిస్థితిని ఎదుర్కున్నానని వివరించాడు. నేను డిప్రషన్ లోకి వెళుతున్నానని తెలిసి నా కుటుంబం ఎప్పుడూ నా వెన్నంటే ఉంది అని తెలిపాడు. ఆధ్యాత్మికత కూడా మానసిక సమస్యల నుంచి బయట పడడానికి తోడ్పడుతుందని అన్నాడు. దగ్గర వారితో మాట్లాడడం, అవసరమైతే కౌన్సిలర్ సహాయం తీసుకోవడం ఉత్తమమం అని తెలిపాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కున్నప్పుడు షమీ పేరును క్రికెట్ బోర్డు నుంచి తొలగించారు.

ఆరోపణలు నిజం కావని రుజువైన మీదట మళ్లీ మార్చి 2018లో జట్టులో చేర్చుకున్నారు. ఆ సమయంలో షమీ ఎంతో మానసిక వేదన అనుభవించానని తెలిపాడు. క్లిష్ట సమయంలో జట్టు సభ్యులతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు అండగా నిలవడం తన అదృష్టమని చెబుతాడు. ఆ దశ నుంచి బయటపడడం తనకు సంతోషంగా ఉందని షమీ అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్నాడని షమీ ఆవేదన చెందుతూ తన జీవితంలో తాను ఎదుర్కున్న మానసిక ఒత్తిడిని వివరించాడు.

Similar News