ఏపీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అసెంబ్లీకి వచ్చిన జగన్.. అనంతరం స్లిప్ తీసుకొని బ్యాలట్ బాక్సులో వేశారు. కాగా ముఖ్యమంత్రి తన ఓటును పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీ బరిలో ఉండగా టీడీపీ నుంచి పోటీలో వర్ల రామయ్య ఉన్నారు.