స్కూల్‌కు అమరవీరుడి పేరు.. ఛతీస్‌గడ్ ప్రభుత్వం ప్రకటన

Update: 2020-06-18 21:59 GMT

చైనా దాడిలో అమరుడైన ఛతీస్‌గడ్ సైనికుడుకి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గౌరవం ఇచ్చింది. ఆ రాష్ట్రానికి చెందిన గణేష్ రామ్ కుంజమ్ అనే సైనికుడు చైనా దాడిలో అమరుడైయ్యాడు. ఛతీస్‌గడ్ సీఎం భూపేష్ బఘేల్ గురువారం అమర వీరుడి పార్థీవదేహానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. గణేష్ రామ్ కుటుంబాన్ని అన్ని విధాల అండగా ఉంటామని.. 20 లక్షల ఎక్స్‌గ్రేషియో, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం ప్రకటిచారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఒక పాఠశాలకు గణేష్ రామ్ కుంజమ్ పేరు పెడతామని ప్రకటించారు.

Similar News